GNTR: తురకపాలెంలో మరణాలు తగ్గుముఖం పట్టాయని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. తురకపాలెంలో అపోహలు తగ్గిపోయాయని, కేవలం రాజకీయ లబ్ధి కోసం కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, ప్రజలు వారిని క్షమించరని అన్నారు. తురకపాలెం గ్రామ ప్రజలకు నిత్యం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, అందరి ఆరోగ్యం సాధారణంగానే ఉందని ఎమ్మెల్యే వెల్లడించారు.