KRNL: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై ఉన్న అధిక పనిభారాన్ని తగ్గించాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఇవాళ ఆస్పరి ఎంపిడివో కార్యాలయంలో ఎంపీడీవో గీతావాణికి వినతి పత్రం సమర్పించారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు లేని విధంగా సచివాలయ ఉద్యోగులకు డోర్-టు-డోర్ వాలంటీర్ విధులు, సెలవు రోజుల్లో బలవంతంగా విధులు నిర్వహించడం బాధాకరమన్నారు.