WGL: పట్టణ కేంద్రంలో ఇవాళ AISF జిల్లా కార్యదర్శి లాదెళ్ల శరత్ ఆధ్వర్యంలో ఆర్డీవో విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. శరత్ మాట్లాడుతూ.. వర్షాల వల్ల శిథిలావస్థలోని హాస్టల్ భవనాలు కూలిపోయే ప్రమాదంలో ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం త్వరగా స్పందించి కొత్త భవనాలు నిర్మించాలని కోరారు. AISF నేతలు ఉన్నారు.