తిరుపతి, తలకోన, నేలపట్టు ప్రాంతాలను పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి కందుల దుర్గేశ్ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పర్యాటక రంగం అభివృద్ధికి ఆసక్తి చూపిస్తున్నారన్నారు. పెట్టుబడిదారులు తిరుపతిలో పెట్టుబడులు పెట్టబడి పెట్టడానికి ముందుకు రావాలని కోరారు. జిల్లాలో ఏకో, అడ్వంచర్ టూరిజం రంగాలలో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయన్నారు.