కృష్ణా: గూడూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం మండల పరిషత్ అధ్యక్షుడు మధుసూదనరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మండల పరిధిలోని వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. అధికారులు తాము ప్రజలకు అందిస్తున్న సేవల గురించి వివరించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు సకాలంలో స్పందించాలని అధ్యక్షులు సూచించారు.