ప్రకాశం: ఒంగోలులోని పాత జడ్పీ సమావేశ మందిరంలో ఇవాళ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. జిల్లా పరిషత్ అధ్యక్షురాలు బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షత వహించారు. సమావేశంలో పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు సత్వరం చర్యలు తీసుకోవాలని అన్నారు. పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.