ASR: అరకు వెళ్లే పర్యాటకులకు ఐటీడీఏ గుడ్ న్యూస్ అందించింది. నేటి నుంచి హాట్ ఎయిర్ బెలూన్ పర్యాటకులకు అందుబాటులోకి రానుందని వివరించింది. పద్మాపురం గార్డెన్లో హాట్ ఎయిర్ బెలూన్ అందుబాటులో ఉండానుందని, పాడేరు ఐటీడీఏ పీవో పూజ శుక్రవారం ఓ ప్రకటనలో వివరించారు. ఈ క్రమంలో అరకు పర్యాటకులకు మరో చక్కటి అనుభూతి అందుబాటులోకి రానుంది.