TG: గ్రూప్-1 అభ్యర్థులు తెలంగాణ భూమి పుత్రులని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. గతంలో కేసీఆర్ సర్కార్ పేపర్ లీక్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 21 నెలలు అవుతున్నా గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ చేయలేదని ఆక్షేపించారు. సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. గ్రూప్-1 పరీక్షను తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు.