NRML: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని గృహ నిర్మాణ డీఈ గంగాధర్ సూచించారు. శుక్రవారం దిలావర్పూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ట్రాక్టర్ డ్రైవర్లు, మేస్త్రీలతో సమావేశం ఏర్పాటు చేశారు.వారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయాలన్నారు. ఎమ్మార్వో, ఎంపీడీవో, ఎంపీవో తదితరులు పాల్గొన్నారు.