SKLM: ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సచివాలయాల సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని ఎమ్మెల్యే గోండు శంకర్రావు ఆదేశించారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం సంక్షేమ పథకాలను సూపర్ సిక్స్ పేరిట ప్రజలకు అందించడం జరుగుతుందని వివరించారు.