ATP: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం వల్ల రానున్న రెండు రోజుల్లో గుత్తిలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గుత్తి మున్సిపాలిటీలో ప్రత్యేక హెల్ప్ లైన్ కౌంటర్ నెంబర్ 9100986901 ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.