పెద్దపల్లి మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన సిలివెరీ రాహుల్, సుల్తానాబాద్కి చెందిన చింతల అలేఖ్య అనారోగ్యంతో హైదరాబాద్లోని నిమ్స్, గాంధీ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారి వైద్య ఖర్చుల కోసం సీఎంఆర్ఎఫ్ నుంచి రాహుల్కు రూ. 2.50 లక్షలు, అలేఖ్యకు రూ. 1.75 లక్షల విలువైన ఎల్వోసీలను శుక్రవారం పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అందజేశారు.