»Natho Nenu Movie First Look Release Jabardasth Actor Shanti Kumar Thurlapati As A Director
Natho Nenu: మూవీ ఫస్ట్‌లుక్ రిలీజ్..డైరెక్టర్ గా మరో జబర్దస్త్ యాక్టర్
నూతన నటీనటులతో శాంతి కుమార్(Shanti Kumar ) తుర్లపాటి (జబర్దస్త్ ఫేమ్) దర్శకత్వంలో ప్రశాంత్ టంగుటూరి నిర్మించిన చిత్రం ‘నాతో నేను’(Natho Nenu). ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రాజ్యసభ సభ్యుడు విజయేంద్రప్రసాద్ తాజాగా ఫిల్మ్ ఛాంబర్లో విడుదల చేశారు. టైటిల్ బాగుందని, ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అనిపిస్తుందని ఆయన అన్నారు.
జబర్దస్త్ నటుడు వేణు దర్శకత్వం వహించిన బలగం మూవీ బాటలోనే.. మరో జబర్దస్త్ ఫేమ్ శాంతి కుమార్ తుర్లపాటి కూడా మెగా ఫోన్ పట్టారు. ఈ క్రమంలో శాంతి కుమార్ డైరెక్షన్ చేసి, ప్రశాంత్ టంగుటూరి నిర్మించిన చిత్రం ‘నాతో నేను'(Natho Nenu). ఈ క్రమంలో ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రాజ్యసభ సభ్యుడు విజయేంద్రప్రసాద్ తాజాగా ఫిల్మ్ ఛాంబర్లో రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో టైటిల్ మంచిగా ఉందన్నారు. ఫస్ట్ లుక్ చూస్తే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మాదిరిగా అనిపిస్తుందని పేర్కొన్నారు. అంతేకాదు కొత్త నిర్మాతల ఈ ప్రయత్నంతో ఈ చిత్రం మంచి విజయం సాధించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
మంచి కథతో శాంతికుమార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని, ఇందులో తాను భాగమైనందుకు ఆనందంగా ఉందని సాయికుమార్ అన్నారు. మంచి కథకు మంచి వ్యక్తి అయిన విజయేంద్ర ప్రసాద్ గారు వచ్చి ఆశీర్వదించడం ఆనందంగా ఉందని తెలిపారు.
Everyone has a story and the journey is evidently striking at a right time! ❤️
తన కథ నచ్చి వెంటనే నిర్మాతలు ఒప్పుకున్నారని దర్శకుడు శాంతికుమార్(Shanti Kumar)పేర్కొన్నారు. సాయి కుమార్(sai kumar) తన తొలి ప్రయత్నాన్ని సపోర్ట్ చేశారని వెల్లడించారు. మంచి సలహా ఇచ్చారని, మంచి కథ రాసుకున్నాను. దాన్ని తెరపై బాగా చూపించి, ఆ దిశగా కృషి చేస్తానని చెప్పారు.
నటీ నటులు: డైలాగ్ కింగ్ సాయి కుమార్, శ్రీశ్రీనివాస్, ఆదిత్యఓం
బ్యానర్: శ్రీ భవనేష్ ప్రొడక్షన్స్
సినిమా పేరు: నాతో నేను
సమర్పకుడు: ఎల్లాలు బాబు టంగుటూరి
నిర్మాత: ప్రశాంత్ టంగుటూరి
దర్శకుడు: శాంతి కుమార్ తుర్లపాటి
DOP: S.మురళీ మోహన్ రెడ్డి
సంగీతం: సత్య కశ్యప్
ఎడిటర్: నందమూరి హరి
ఆర్ట్ డైరెక్టర్: పెద్దిరాజు అడ్డాల
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
కొరియోగ్రాఫర్: భాను, చంద్ర కిరణ్
PRO : మధుVR