CTR: గంగాధర నెల్లూరు గ్రామ పంచాయతీలో శుక్రవారం ఇన్ఛార్జ్ డిప్యూటీ ఎంపీడీవో శివయ్య చెత్త సేకరణను పరిశీలించారు. మండలంలోని ప్రతి ఇంటి నుంచి ప్రతిరోజు నిర్దేశించిన సమయంలో చెత్త సేకరణ తప్పకుండా చేపట్టాలని గ్రీన్ అంబాసిడర్లకు సూచించారు. ఈ మేరకు సేకరించిన చెత్తను సేంద్రియ ఎరువులుగా మార్చడానికి తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి చెత్త సేకరణ కేంద్రాలకు తరలించాలన్నారు.