»Save The Tigers Movie Trailer Is Out April 27th On Ott Disney Plus Hot Star
Save the Tigers: ట్రైలర్ అదిరింది..పురుషులు పులుల్లాగా అంతరించి పోవొద్దు!
కామెడీ వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్(Save the Tigers) ట్రైలర్‌ను మేకర్స్ గురువారం విడుదల చేశారు. ఈ వెబ్ సిరీస్‌లో అభినవ్ గోమతం, ప్రియదర్శి, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో యాక్ట్ చేశారు. సేవ్ ది టైగర్స్ ఏప్రిల్ 27న డిస్నీ + హాట్‌స్టార్(disney plus hot star)లో విడుదల కానుంది. ప్రదీప్ అద్వైతం రాసిన ఈ వెబ్ సిరీస్‌కి తేజ కాకుమాను దర్శకత్వం వహిస్తున్నారు.
గతంలో క్షేమంగా వెళ్లి లాభంగా రండి నుంచి సందడే సందడి, ఇటీవలి F2 వరకు వైవాహిక జీవితంలోని ఆలుమగల మధ్య గొడవలు, హాస్యంతో వచ్చిన చిత్రాలేనని చెప్పవచ్చు. అలాంటి స్టోరీతోనే సేవ్ ది టైగర్స్(Save the Tigers) అనే కొత్త చిత్రం రాబోతుంది. ఈ క్రమంలో మేకర్స్ ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ వీడియోలో పెళ్లి చేసుకున్న పురుషులు కూడా అడవుల్లో పులుల్లాగా అంతరించి పోదామా అంటున్న డైలాగ్ ఆసక్తికరంగా మారింది. పోరాడి మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలని అంటుండటం వీడియోలో చూడవచ్చు.
గంటా రవి, గౌతమ్, విక్రమ్ అనే ముగ్గురు భర్తల కష్టాల చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. గంటా రవి తన ప్రాంతంలో చిన్న డైరీ ఫామ్‌ను నడుపుతున్న స్థానిక వ్యాపారవేత్త కాగా, అతని భార్య సుజాత స్థానికంగా బ్యూటీ పార్లర్‌ను నడుపుతోంది. గౌతమ్ రచయితగా మారడానికి విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతని భార్య మాధురి డాక్టర్. యాడ్ ఏజెన్సీలో క్రియేటివ్ హెడ్. విక్రమ్, అతని భార్య రేఖ పలు సమస్యలను ఎదుర్కొన్న క్రమంలో ఈ మూవీ స్టోరీ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
ముగ్గురూ తమ సంబంధాలను ఎలా కాపాడుకుంటారు? ప్రియదర్శి(Priyadarshi), చైతన్య కృష్ణ(Chaitanya Krishna), అభినవ్ గోమతం(Abhinav Gomatam) ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ షోలో హైమవతి, పావని గంగిరెడ్డి, దేవియాని, గంగవ్వ, హర్షవర్ధన్, వేణు టిల్లు, రోహిణి, సద్దాం కూడా యాక్ట్ చేశారు. ప్రదీప్ అద్వైతం, విజయ్ నామోజు, ఎస్ ఆనంద్ కార్తీక్ రచించిన ఈ షోకి సినిమాటోగ్రఫీ: ఎస్వీ విశ్వేశ్వర్, సంగీతం: అజయ్ అరసాద, ఎడిటర్ శ్రవణ్ కటికనేని. తేజ కాకుమాను దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఏప్రిల్ 27న డిస్నీ+ హాట్‌స్టార్(disney plus hot star)లో రిలీజ్ కానుంది.