Secunderabad:అర్ధరాత్రి దారుణం.. భర్త కళ్లముందే భార్య హత్య
రాణిగంజ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్(Panjab National Bank) సమీపం వద్ద యాచకురాలు దారుణ హత్యకు గురైంది. ఫుట్ పాత్ పై నిద్రస్తున్న మహిళ పై గుర్తు తెలియని వ్యకి బండ రాయితో హత్య చేశారు. యాచకురాలి(Begger) పక్కనే భర్త కూడా ఉండటం గమనార్హం.
Secunderabad:సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్(Mahankali Police station) పరిధిలో బుధవారం అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. రాత్రి జరిగిన ఈ హత్య తెల్లారిన తర్వాత వెలుగు లోకి వచ్చింది. దీనికి సంబంధించిన సీసీ టీవీ(CCTV) ఫుటేజీ కూడా వెలుగు చూసింది. రాణిగంజ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్(Panjab National Bank) సమీపంలో యాచకురాలు దారుణ హత్యకు గురైంది. ఫుట్ పాత్(Footpath) పై నిద్రస్తున్న మహిళ పై గుర్తు తెలియని వ్యకి బండ రాయితో హత్య చేశారు. యాచకురాలి పక్కనే భర్త కూడా ఉండటం గమనార్హం. భర్త చూస్తుండగానే భార్యపై బండరాయి వేసి హత్య చేశాడో వ్యక్తి. భర్త భయంతో అరుస్తున్నా తన చేయిపట్టుకుని ముందుకు లాగి ఆమెపై బండరాయి వేశాడు. దాంతో ఆమె బాధతో విలవిలలాడింది.
తీవ్ర గాయాలతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆమె మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి(Gandhi Hospital)కి తరలించారు. గుర్తు తెలియని వ్యక్తి వచ్చి భర్త కళ్లముందే భార్యను హతమార్చుతున్న భర్త ఎందుకు ఆపలేదు? హత్యతో భర్తకు ఏమైనా సంబంధం ఉందా? లేక గుర్తు తెలియని వ్యక్తి ఒక యాచకురాలిని చంపేంత కసి ఏముంది? భర్త పక్కనే ఉండగా ఏ ధైర్యంతో ఆమెను హతమార్చాడు. భర్తే ఆమెను చంపేందుకు ప్లాన్ వేశాడా? లేక హతమార్చిన వ్యక్తి మద్యం మత్తులో ఉండి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా? అనే కోణంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.