»Manufacture Of Chocolates With Contaminated Water Harmful Chemicals In Hyderabad Attapur
Chocolates : హైదరాబాద్లో నకిలీ చాకెట్ల తయారీ.. పోలీసుల దాడి
పిల్లలు తినే చాక్లెట్లు, లాలీ పాప్ లను కలుషిత నీటితో, ప్రమాదకర కెమికల్స్ తో తయారు చేసి మార్కెట్ లో అమ్మేస్తున్నారు. హైదరాబాద్ లో దారుణం వెలుగుచూసింది. అత్తాపూర్ లో నాసిరకం చాక్లెట్ల తయారీ దందా బయటపడింది.
Chocolates : డబ్బు సంపాదనే లక్ష్యంగా కొందరు దుర్మార్గులు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. కాసుల కోసం కక్కుర్తిపడి నీచానికి ఒడిగడుతున్నారు. పిల్లలు తినే చాక్లెట్లు(Chocolates), లాలీ పాప్ లను కలుషిత నీటితో, ప్రమాదకర కెమికల్స్ తో తయారు చేసి మార్కెట్ లో అమ్మేస్తున్నారు. హైదరాబాద్(Hyderabad) లో దారుణం వెలుగుచూసింది. అత్తాపూర్(Attapur) లో నాసిరకం చాక్లెట్ల తయారీ దందా బయటపడింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇళ్ల మధ్య నడుపుతున్న చాక్లెట్ల తయారీ పరిశ్రమపై ఎస్వోటీ పోలీసులు(SOT police) మెరుపు దాడి చేశారు. ఈ దాడుల్లో పోలీసులు సైతం అవాక్కయ్యే విషయాలు వారు కనుగొన్నారు.
నకిలీ చాకెట్లు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు పోలీసులు ఈ దాడి చేశారు. పోలీసుల దాడిలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ఈ పరిశ్రమలో విషపూరిత రసాయనాలు(Chemicals), కలుషిత నీటితో చాక్లెట్లు, లాలీపాప్స్(Lollypops) తయారు చేస్తున్నట్లు ఎస్వోటీ పోలీసులు గుర్తించారు. వాటిని మార్కెట్ లో విక్రయించి డబ్బు సంపాదించడమే కాకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లు వారు చెబుతున్నారు. అపరిశుభ్ర వాతావరణంలో డ్రమ్ముల్లో పానకం నిల్వ చేసి, ఆ పానకంతోనే చాక్లెట్స్ తయారు చేస్తున్నారు. ఇలాంటి చాక్లెట్లను పిల్లలు తింటే వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లనుందని వారు తెలిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి కేటుగాళ్లను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.