తమకు మానవతా సాయం (humanitarian aid) చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ (Ukraine President Zelensky) భారత ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు (prime minister of india Narendra Modi). ఏడాదికి పైగా రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం నెలకొన్న విషయం తెలిసిందే (russia ukraine war). దీంతో ఇరు దేశాలు భారీగా నష్టపోయాయి. ఉక్రెయిన్ ఆర్థికంగాను చిక్కిపోయింది. ఈ నేపథ్యంలో అదనపు మానవతా సాయం కోరుతూ మోడీకి లేఖ రాశారు జెలెన్ స్కీ (Ukraine President Zelensky writes to PM Modi). ఈ మేరకు విదేశాంగ శాఖ లేఖ రాసినట్లు వెల్లడించింది. వైద్య పరికరాలు, మందులతో సహా అదనపు మానవతా సామాగ్రిని కోరారు. ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి ఎమినే జపరోవా భారత్ లో పర్యటిస్తున్నారు (Ukraine’s first Deputy Foreign Minister Emine Dzhaparova). ఈ సందర్భంగా మోడీని ఉద్దేశిస్తూ జెలెన్ స్కీ రాసిన లేఖను ఆమె విదేశాంగ శాఖకు అందించారు. వైద్య సామాగ్రి తదితర మానవతా సాయాన్ని కోరారు. ఇందుకు భారత్ ముందుకు వచ్చిందని భారత విదేశాంగ సహాయ మంత్రి మీనాక్షి లేఖి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు (MoS Meenakshi Lekhi). ఇరువురు సమావేశమై ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు.
ఏడాదికి పైగా ఉక్రెయిన్ దురాక్రమణను ఎదుర్కొంటోందని జపరోవా అన్నారు. ఉక్రెయిన్ పునర్నిర్మాణం భారత సంస్థలకు ఓ మంచి అవకాశంగా చెప్పారు. గత ఏడాది రష్యాతో యుద్ధం ప్రారంభమయ్యాక ఉక్రెయిన్ మంత్రి భారత్‌లో అధికారికంగా పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. జెలెన్ స్కీ గత డిసెంబర్లో ప్రధాని మోడీతో టెలిఫోన్లో మాట్లాడి.. మానవతావాద మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఉక్రెయిన్ యుద్ధంపై పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు. శత్రుత్వాలను తక్షణమే విరమించుకోవాలని మోడీ తన పిలుపునిచ్చారు. ఇరుపక్షాలు దౌత్యపరమైన చర్చలతో ముందుకు సాగాలన్నారు.
వివాద పరిష్కారం కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని మోడీ టెలిఫోన్ సంభాషణలు జరిపారు. ప్రస్తుతం ప్రపంచంలోని ప్రధాన ఆందోళనల్లో ఆహారం, ఎరువులు, ఇంధన భద్రతతో కూడిన యుద్ధానికి ఇది సమయం కాదని కూడా పుతిన్‌తో చెప్పారు. నేటి యుగం యుద్ధ యుగం కాదని, ఇదే అంశం గురించి మీతో ఫోన్ ద్వారా మాట్లాడానని ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన ప్రాంతీయ భద్రతా కూటమి శిఖరాగ్ర సమావేశంలో పుతిన్‌కు మోడీ గుర్తు చేశారు కూడా. ఈ వ్యాఖ్యలపై పుతిన్ స్పందిస్తూ… ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ ఆందోళన గురించి తనకు తెలుసని ప్రధాని మోడీకి చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. వీలైనంత త్వరగా దీనికి ముగింపు పలుకుతామని చెప్పారు.