AP: ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. అభివృద్ధిలో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నామన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా చేస్తున్నామని చెప్పారు. వైద్య కళాశాలలను నాణ్యమైన ప్రమాణాలతో తీర్చిదిద్దుతామన్నారు. వైసీపీ నేతలు పంచభూతాలను సైతం వదలకుండా కొల్లగొట్టారని విమర్శించారు.