AP: సీఎం చంద్రబాబు.. రాయలసీమకు అపర భగీరథుడు అని మంత్రి సవిత అన్నారు. అనంతపురంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ఆమె.. హామీ ఇవ్వనటువంటి వాగ్ధానాలను సైతం నెరవేరుస్తున్నామన్నారు. సూపర్ సిక్స్ పథకాలు అబద్ధం అంటున్న జగన్ పార్టీనే అబద్ధం అని విమర్శించారు. కేంద్రం అండతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నామన్నారు.