SRD: ఈత చెట్లు గీత కార్మికులకు మంచి ఆదాయాన్ని వస్తుందని ఖేడ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్ఫెక్టర్ పవన్ కుమార్ అన్నారు. బుధవారం కంగ్టి శివారులో ఎంపీడీవో సత్తయ్య, ఏపీవో నర్సింలుతో కలిసి 150 ఈత మొక్కలు నాటి నీళ్ళు పోశారు. వీటిని కార్మికులు బాధ్యతతో పెంచి, ఈత చెట్ల వల్ల వచ్చే ఆదాయంతో లబ్ధి పొందాలని సూచించారు. ఇందులో ఎంపీవో సుభాష్, రైతు గణేష్ గౌడ్ తదితరులు ఉన్నారు.