»Karnataka Elections 2023 Shock To Bjp Ex Dy Cm Laxman Savadi Quits Bjp
Karnataka ఎన్నికల వేళ బీజేపీకి భారీ షాక్.. మాజీ డిప్యూటీ సీఎం రాజీనామా
తొలి జాబితా విడుదల చేయగా.. వారిలో చాలా మంది సీనియర్లకు మొండిచేయి చూపారు. వీరి రాజీనామాలతో బీజేపీపై తీవ్ర ప్రభావం పడనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమైంది.
ఎన్నికల వేళ కర్ణాటకలో (Karnataka) బీజేపీకి ఊహించని పరిణామం ఎదురైంది. పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న వ్యక్తి రాజీనామా చేయడంతో బీజేపీకి భారీ దెబ్బ తగిలింది. అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో మాజీ ముఖ్యమంత్రికి అవకాశం కల్పించకపోగా తాజాగా మాజీ ఉప ముఖ్యమంత్రి (Deputy CM) పార్టీకి కూడా టికెట్ ఇవ్వలేదు. అయితే మాజీ డిప్యూటీ సీఎం తనకు అవకాశం ఇవ్వకపోడంతో పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. టికెట్ నిరాకరించిన కారణంగా బీజేపీకి రాజీనామా చేశాడు. దీంతో కర్ణాటకలో కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి.
తనకు తొలి జాబితాలో అవకాశం ఇవ్వకపోవడంతో మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ లక్ష్మణ్ సావడి (Laxman Savadi) బీజేపీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బెళగావి జిల్లాలోని అథని నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా లక్ష్మణ్ గెలిచాడు. 2018లో జరిగిన ఎన్నికల్లో ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్ కుమతల్లి గెలిచాడు. అయితే గెలిచిన అనంతరం మహేశ్ బీజేపీలోకి చేరడంతో లక్ష్మణ్ కు ప్రాధాన్యం తగ్గింది. తాజాగా ఆ స్థానాన్ని మళ్లీ మహేశ్ కు బీజేపీ కేటాయించడంతో లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ తీరును నిరసిస్తూ రాజీనామా చేశాడు. ఈయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నాడు. ఇప్పటికే బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు పుట్టన్న, చించాన్ సుర్ కాంగ్రెస్ లో చేరాడు. వీరి రాజీనామాలతో బీజేపీపై తీవ్ర ప్రభావం పడనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమైంది. మరోసారి అధికారం కోసం కమలం పార్టీ అడ్డదారులు తొక్కుతోంది.
కన్నడ సీమలో మే 10వ తేదీన 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు అధికార బీజేపీ అభ్యర్థులను నిలబెడుతోంది. అయితే పాత వారికి కాకుండా కొత్త వారికి అవకాశాలు ఇస్తోంది. మంగళవారం 189 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేయగా.. వారిలో చాలా మంది సీనియర్లకు మొండిచేయి చూపారు. టికెట్ జాబితాలో మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్ (Jagadish Shettar) కూడా పార్టీ టికెట్ నిరాకరించింది.