GNTR: నగరాభివృద్ధికి ప్రజలు ఆస్తి పన్నులను సకాలంలో చెల్లించాలని మంగళవారం గుంటూరు మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు కోరారు. పన్ను బకాయిలు చెల్లించిన వారికి ఆయన అభినందనలు తెలిపారు. ప్రజలు చెల్లించే పన్నుల ద్వారానే మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుందని చెప్పారు. బకాయిల వసూలుపై దృష్టి సారించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.