»Senior Congress Leader And Former Minister Kunduru Janareddy Has A Heart Attack
K.Jana Reddy:కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డికి గుండె పోటు
కాంగ్రెస్(Congress) సీనియర్ లీడర్, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి(K.Jana Reddy) గుండె పోటు బారిన పడ్డారు. తెల్లవారు జామున ఛాతీలో నొప్పి రావడం తో వెంటనే జానారెడ్డిని కుటుంబ సభ్యులు సోమాజిగూడ యశోదా ఆసుపత్రి కి తరలించారు.
K.Jana Reddy:కాంగ్రెస్(Congress) సీనియర్ లీడర్, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి(K.Jana Reddy) గుండె పోటు బారిన పడ్డారు. తెల్లవారు జామున ఛాతీలో నొప్పి రావడం తో వెంటనే జానారెడ్డిని కుటుంబ సభ్యులు సోమాజిగూడ యశోదా ఆసుపత్రి (Yashoda Hospital) కి తరలించారు. ఆస్పత్రి వైద్యులు జానారెడ్డి కి యాంజియో గ్రామ్ పరీక్షలు(angiogram test) నిర్వహించారు. గుండె(Heart) కు రక్తం సరఫరా అయ్యే వాల్వ్ మూసుకుట్లోయినట్లు గుర్తించి వెంటనే డాక్టర్లు ఆపరేషన్ చేసి స్టంట్ వేశారు. ప్రస్తుతం జానారెడ్డి యశోదా ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లో ఉన్నారు. జానారెడ్డి క్షేమంగా తిరిగి రావాలని ఆయన అభిమానులు(Fans) కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటున్నారు.
ఇటీవల చాలా మంది గుండెపోటుతో చనిపోతున్నారు. అప్పటివరకు నవ్వుతూ, ఆడుకుంటూ, నడుస్తూ హఠాత్తుగా చనిపోవడం వైద్యులను సైతం ఆలోచించేలా చేసింది. అటువంటి పరిస్థితిలో, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ మధ్య కాలంలో చాలా మంది ఫిట్ గా ఉన్న యువకులు హఠాన్మరణం(Sudden dead) చెందడం ఆందోళనను మరింత పెంచింది. కోవిడ్(Covid) తర్వాత అకస్మాత్తుగా గుండెపోటులు పెరుగుతున్నాయని, మన గుండెను ఎలా పదిలంగా ఉంచుకోవాలనే దానిపై చర్చ జరుగుతోంది. ఆకుపచ్చని కూరగాయలు ఆరోగ్యకరమైన గుండెకు చాలా మేలు చేస్తాయి. గుండెతో పాటు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే అనేక రకాల పోషకాలు పచ్చి కూరగాయల్లో ఉంటాయి. అందుకే ఆకుకూరలు మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తప్పనిసరిగా తినాలి.