AP: ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడికి లోకేష్ ఆశీస్సులు అందించి, ఎత్తుకుని ముద్దులాడారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యుల యోగక్షేమాల గురించి ఆరా తీశారు. కాగా, ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో లోకేష్ ఢిల్లీకి వెళ్లారు. ఓటింగ్ ప్రక్రియపై ఎంపీలకు పలు సూచనలు చేశారు.