»Punjab 4 Soldiers Dead In Firing Inside Bathinda Military Station
Bathinda Military Station సైన్యంలో కలకలం.. కాల్పుల్లో 4గురు సైనికులు మృతి
ఘటన జరిగింది వాస్తవమేనని ధ్రువీకరించారు. ఇది ఉగ్రవాదుల చర్య కాదని, అంతర్గతంగా జరిగిన సంఘటన అని స్పష్టం చేశారు. అసలు లోపల ఏం జరిగిందో కూడా స్పష్టంగా తెలియడం లేదు.
భారత సైన్యం (Indian Army) శిబిరంలో కాల్పులు కలకలం రేపాయి. మిలిటరీ స్టేషన్ లో ఉండగానే కాల్పులు జరిగి నలుగురు సైనికులు మృతి చెందగా.. కొందరు గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకోవడం గమనార్హం. ఈ సంఘటన పంజాబ్ (Punjab)లో చోటుచేసుకుంది. అయితే ఇది ఉగ్రవాదుల (Terror) పని కాదని పోలీసులు కొట్టిపారేశారు. అంతర్గతంగా సైనికుల మధ్య ఘర్షణే ఈ కాల్పులకు కారణంగా తెలుస్తున్నది. వివరాలు ఇలా ఉన్నాయి.
పంజాబ్ లోని భఠిండా మిలిటరీ స్టేషన్ (Bathinda Military Station) ఉంది. ఈ స్టేషన్ లో భారత సైనికులు (Indian Soldiers) పెద్ద ఎత్తున ఉంటారు. తెల్లవారుజామున 4.35 సమయంలో స్టేషన్ లోపల కాల్పులు వినిపించాయి. వెంటనే అప్రమత్తమైన స్టేషన్ అధికారులు పరిశీలించారు. రక్తపు మడుగులో నలుగురు జవాన్లు కనిపించారు. మరికొందరు జవాన్లు గాయపడ్డారు. వెంటనే గాయపడిన ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై భఠిండా సీనియర్ సూపరింటెండెంట్ (ఎస్ఎస్పీ) గుల్నీత్ సింగ్ ఖురానా (Gulneeth Singh Khurana) స్పందించారు. ఘటన జరిగింది వాస్తవమేనని ధ్రువీకరించారు. ఇది ఉగ్రవాదుల చర్య కాదని, అంతర్గతంగా జరిగిన సంఘటన అని స్పష్టం చేశారు. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. అసలు లోపల ఏం జరిగిందో కూడా స్పష్టంగా తెలియడం లేదు.
#WATCH | Visuals from outside Bathinda Military Station where four casualties have been reported in firing inside the station in Punjab; search operation underway pic.twitter.com/jgaaGVIdMS