ప్రకాశం: మార్కాపురం వైసీపీ ఇంఛార్జ్ అన్నా వెంకట రాంబాబు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అన్ని విధాల విఫలమైందని, రైతులకు కనీసం యూరియా కూడా అందించలేని స్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. అనంతరం ఆయన మంగళవారం జరగబోయే రైతు పోరు బాట కార్యక్రమం వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన ఆయన, రేపు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పిస్తాము అని స్పష్టం చేశారు.