»Police Seized Drugs Worth Over 8 Crores In Bengaluru Five Foreigners Arrested
Drugs seized: బెంగళూరులో 8.2 కోట్ల డ్రగ్స్ స్వాధీనం, ఐదుగురు విదేశీయులు అరెస్ట్
కర్ణాటకలో 2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు నిఘా పెంచారు. నగరంలో జరుగుతున్న ప్రతి అనుమానాస్పద కార్యకలాపాలపైనా అధికారులు నిఘా పెడుతున్నారు. దీనికి సంబంధించి బెంగళూరులో డ్రగ్స్(drugs) స్మగ్లింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేసి ఐదుగురు విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నిందితుల నుంచి రూ.8.2 కోట్ల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Drugs seized: కర్ణాటకలోని బెంగళూరు(bengaluru)సౌత్ డివిజన్లోని వీవీ పురా, జయనగర్ పోలీస్ స్టేషన్ల పోలీసులు రూ.8.2 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు విదేశీ నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. ఈ కేసులో లారెన్స్, చుక్వునామ్, హాస్లీ, ఫ్రాంక్ జాగు, ఇమ్మాన్యుయేల్ నాజీలను పోలీసులు అరెస్ట్ చేశారు. వివి పురం మెట్రో స్టేషన్(metro station) సమీపంలో ఇద్దరు విదేశీయులు సింథటిక్ డ్రగ్స్(syntatic Drugs) విక్రయిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు వివి పుర పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు విదేశీయుల(foreigners)ను అదుపులోకి తీసుకున్నారు. సోదాల్లో నిందితుల నుంచి వైట్ ఎండీఎంఏ, బ్రౌన్ ఎండీఎంఏ, 300 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.
సింథటిక్ డ్రగ్స్‌లో ఇదే అత్యంత ఖరీదైన డ్రగ్ అని పోలీసులు తెలిపారు. దీని ఖరీదు దాదాపు రూ.7 కోట్లు ఉంటుందని అంచనా. అదేవిధంగా కొన్ని నిర్దిష్ట సమాచారం మేరకు జయనగర్ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రూ.1కోటి 20 లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం గురించి బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. డ్రగ్స్‌పై మా ప్రచారం కొనసాగుతోంది. డ్రగ్స్ వ్యాపారంపై నిఘా ఉంచాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. జయనగర్, వివి పుర పోలీస్ స్టేషన్లలో నాలుగు కేసులు నమోదయ్యాయి. అరెస్టయిన విదేశీయుల వీసాల గడువు ముగిసింది. ఐదుగురిలో ముగ్గురు గతంలో కొన్ని కేసుల్లో ప్రమేయం ఉన్నవారే. తర్వాత బెయిల్‌పై విడుదలై మళ్లీ డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడ్డాడు.