HYD: అత్యంత క్లిష్టమైన రహదారుల్లో, నగరంలో వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా సేఫ్ డిస్టెన్స్ పాటించాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. కనీసం 1.2 మీటర్ల దూరంలో వాహనాలు నడపటం ఎంతో మేలని పేర్కొన్నారు. గణపతి నిమజ్జనం వేళ ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమ, నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. మన అజాగ్రత్త ఇతర వాహనదారులకు ఆటంకం కలిగించోద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.