BHPL: క్రీడలు ఆనందాన్ని మాత్రమే కాకుండా ఆరోగ్యానికి, శారీరక ధృడత్వానికి, పట్టుదలకు దారి తీస్తాయని సింగరేణి భూపాలపల్లి ఏరియా ఐఈడీ ఏజీఎం జ్యోతి అన్నారు. శనివారం అంబేద్కర్ స్టేడియంలో డబ్ల్యూపీఎస్, జీఎ 26వ వార్షిక క్రీడా పోటీలలో భాగంగా ఏర్పాటు చేసిన ఫుట్బాల్ పోటీలకు వారు ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ మారుతి పాల్గొన్నారు.