GNTR: నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ANU) ఈసారి భారీగా వెనుకబడింది. గతేడాది 59వ స్థానంలో ఉన్న ఏఎన్‌యూ, ఈ సంవత్సరం 84వ స్థానానికి పడిపోయింది. 2024లో సాధించిన ర్యాంకుతో ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన చేస్తుందని అందరూ ఆశించారు. కానీ, 25 స్థానాలు పడిపోవడంతో నిరాశ పడ్డారు.