W.G: ఉండి మండలం యండగండిలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం ఈ-క్రాప్ నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఆయన వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడుతూ.. ఈ-క్రాప్ నమోదు ఎలా జరుగుతుంది, ఇప్పటివరకు మండలంలో ఎంత శాతం పూర్తయిందని అడిగి తెలుసుకున్నారు. అలాగే, ఇప్పటివరకు రైతులకు 480 టన్నుల యూరియాను సరఫరా చేసినట్లు ఆయన తెలిపారు.