ప్రకాశం: కనిగిరి పట్టణ టీడీపీ అధ్యక్షునిగా షేక్ ఫిరోజ్ శుక్రవారం ఎంపికయ్యారు. పట్టణంలో ప్రస్తుతం తెలుగు యువత అధ్యక్షునిగా ఫిరోజ్ పనిచేస్తున్నారు. యువత అధ్యక్షునిగా ఫిరోజ్ అంకితభావంతో పనిచేయటమే కాకుండా, యువతలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఫిరోజ్ సేవలను గుర్తించిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆయనను కనిగిరి టీడీపీ అధ్యక్షునిగా నియమించారు.