ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెం వద్ద శుక్రవారం రాత్రి ఓ కారు సాగర్ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. నీళ్లలో పూర్తిగా మునిగిపోయిన కారును బయటకు తీసేందుకు పోలీసులు క్రేన్ సహాయం తీసుకున్నారు. కారులో ఎంతమంది ఉన్నారు, ఎక్కడ నుంచి వస్తున్నారు? అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.