సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ నెల 17వ తేదీన ఇందిరాపార్క్ (indira park) వద్ద నిరహార దీక్ష చేపట్టాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అఖిలపక్ష సమావేశానికి ప్రతిపక్ష, వామపక్ష, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.
రాజకీయాలు, సిద్ధాంతాలు పక్కన పెట్టి కలిసి పోరాటం చేస్తున్నామని వైఎస్ షర్మిల (YS Sharmila) పిలుపునిచ్చారు.
మండలానికి స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. నిరుద్యోగికి వెంటనే నిరుద్యోగ భృతి చెల్లించాలని కోరారు. 10 లక్షల మంది యువతకి కార్పొరేషన్ తరపున లోన్లు వెంటనే విడుదల చేయాలని కోరారు.
విద్యార్థుల కోసం రాజకీయాలు పక్కన పెట్టాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ (addanki dayakar) అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో ఐక్య కార్యాచరణ అవసరం ఉందని ప్రజా ఉద్యమ నాయకుడు గద్దర్ (gaddar) అన్నారు.
అఖిలపక్ష సమావేశంలో ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బలమూరి వెంకట్, సీపీఎం న్యూడెమెక్రసీ నేత వేములపల్లి వెంకట్ రామయ్య, సీపీఐ నేత వలి, బీసీ యునైటెడ్ ఫ్రంట్ నేత రామకృష్ణయ్య, గిరిజన శక్తికి చెందిన శరత్ నాయక్ పాల్గొన్నారు.