GNTR: పొన్నూరు మండలం పచ్చలతాడిపర్రులో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, జనసేన పొన్నూరు ఇన్ఛార్జ్ వడ్రాణం మార్కండేయ బాబు శుక్రవారం స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.