MBNR: మిడ్జిల్ మండలం కొత్తూరులో ఇసుక అక్రమ రవాణాపై అధికారులు చర్యలు చేపట్టారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఉంచిన ఇసుక డంపుల నుంచి అక్రమ రవాణా జరుగుతున్నట్లు ఎమ్మార్వో రాజుకు సమాచారం అందింది. దీంతో శుక్రవారం ఆయన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని డంపులను సీజ్ చేశారు. ఈ ఆపరేషన్లో హెడ్ కానిస్టేబుల్ నారాయణరెడ్డితో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.