KNR: నేటి బాలలను రేపటి భావి పౌరులుగా ఉన్నతంగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులు నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగాలని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రం సమీపంలో కొత్తపల్లి స్వాగత్ ఫంక్షన్ హాలులో తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘంఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు.