TG: బాలాపూర్ గణేశుడి ఊరేగింపు నెమ్మదిగా కొనసాగుతోంది. ఊరేగింపు సమయంలో చిన్న ఆటంకం ఏర్పడటంతో.. లడ్డూ వేలంపాట నిర్ణీత సమయం కంటే ఆలస్యమయ్యే అవకాశం ఉంది. లడ్డూ కోసం ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. ఈసారి గతంలో కంటే రూ. 5లక్షల నుంచి రూ. 6 లక్షల ఎక్కువ ధర పలకనుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.