US ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ ఫైనల్‌కు జానిక్ సిన్నర్ చేరుకున్నాడు. సెమీఫైనల్స్‌లో కెనడా ఆటగాడు ఫెలిక్స్ ఆగర్-అలియాసిమ్‌పై 6-1, 3-6, 6-3, 6-4 తేడాతో విజయం సాధించాడు. ఈ మ్యాచ్ సుమారు మూడున్నర గంటల పాటు సాగింది. రేపు ఫైనల్లో సిన్నర్, కార్లోస్ అల్కరాస్‌తో తలపడనున్నాడు.