NLG: మర్రిగూడ మండలంలోని రాంరెడ్డిపల్లిలో ప్రతిష్టించిన వినాయకుడి లడ్డూ భారీ ధర పలికింది. శ్రీ సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ నిర్వహించిన వేలంలో కుందారపు మల్లయ్య-హేమలత దంపతులు లడ్డూను రూ.33,116కు దక్కించుకున్నారు. కలశాన్ని కుందారపు సత్యనారాయణ రూ.23116 కు సొంతం చేసుకున్నారు. ఈ వేలంలో స్థానిక కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.