ప్రకాశం: జిల్లాలోని సీఎస్ పురం మండలం అంబవరం కొత్తపల్లిలో వెలసిన శ్రీ భైరవేశ్వర స్వామి ఆలయానికి చంద్రగ్రహణం కారణంగా దర్శనాలను నిలిపివేస్తున్నట్లు EO వంశీకృష్ణారెడ్డి తెలిపారు. ఈనెల 7వ తేదీన మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శన అవకాశం ఉంటుందన్నారు. సెప్టెంబర్ 8న ఉదయం 6 గంటలకు ఆలయ శుద్ధి సంప్రోక్షణ జరిపించి పునర్దర్శనం ప్రారంభిస్తామని చెప్పారు.