TG: బాలాపూర్ వినాయకుడి శోభాయాత్రకు ఆటంకం ఏర్పడింది. బాలాపూర్ గ్రామంలో ఊరేగింపునకు వెళ్లిన గణనాథుడికి.. ఓ వీధిలో రేకుల షెడ్డు అడ్డురావడంతో ఇరుక్కున్నాడు. దీంతో ఆ రేకుల షెడ్డుని అక్కడి సిబ్బంది తొలగిస్తున్నారు. కాగా, గ్రామంలో ఊరేగింపు తర్వాత.. గ్రామ బొడ్రాయి వద్ద లడ్డూ వేలం పాట నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సర్వం సిద్ధం చేశారు.