MDCL: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తిరుమల గార్డెన్స్ ప్రాంతంలో గణపతి ఉత్సవాల వేళ శానిటేషన్ కరువైంది. అనేక ప్రాంతాల్లో ఎక్కడపడితే అక్కడ కుప్పలు తెప్పలుగా గార్బేజ్ పేరుకుపోయి ఉందని, దీంతో దుర్గంధ భరితపు వాసన వస్తున్నట్లుగా వాహనదారులు, స్థానిక ప్రజలు, గణపతి భక్తులు తెలిపారు. అధికారిక యంత్రాంగం తగిన విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.