TPT: నాయుడుపేటలోని బిరదవాడ వద్ద ఏర్పాటు చేసిన టిడ్కో గృహాలను ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ శనివారం పరిశీలించారు. ఇందులో భాగంగా టిడ్కో గృహాల వద్ద చేపట్టిన పనులు, తీసుకోవాల్సిన చర్యలపై మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లాతో చర్చించారు. ఆయన మాట్లాడుతూ.. 80 శాతంపైగా పూర్తి చేసిన గృహాలను లబ్ధిదారులకు అందించడంలో గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు.