హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణించేందుకు బ్యాటరీ వీల్‌ఛైర్‌కు అనుమతి నిరాకరించడంతో దివ్యాంగుడైన మిట్టపల్లి శివకుమార్ ఇబ్బంది పడ్డారు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మెట్రో సిబ్బంది తనను అవమానించారని, నాలుగు గంటల పాటు స్టేషన్లోనే ఉండిపోయేలా చేశారని ఆయన మెట్రో ఎండీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై మెట్రో సిబ్బంది క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశరు.