TG: హైదరాబాద్‌లో గణేశుడి నిమజ్జన శోభ సంతరించుకుంది. ఖైరతాబాద్, బాలాపూర్‌లో భక్తుల సందడి నెలకొంది. హుస్సేన్ సాగర్‌కు ఏకదంతులు క్యూ కట్టారు. జైజై గణేశా.. బైబై గణేశా నినాదాలతో పరిసరాలు మార్మోగుతున్నాయి. సాగర్ చుట్టుపక్కల ప్రాంతాలు కాషాయమయంగా మారిపోయాయి. ఈ మేరకు నగరవ్యాప్తంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.