KMR: ప్రభుత్వ పథకాల అమలులో దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సూచించారు. బుధవారం మాచారెడ్డి రైతు వేదికలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అర్హులైన వారు నేరుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పారదర్శకతతోనే లబ్ధిదారులకు పథకాలు అందుతాయని స్పష్టం చేశారు.