AP: సుబ్రమణ్యం హత్య కేసులో MLC అనంతబాబు బెయిల్ రద్దుపై కోర్టులో వాదనలు జరిగాయి. రాజమహేంద్రవరంలోని ప్రత్యేక కోర్టులో ప్రత్యేక PP ముప్పాళ్ల సుబ్బారావు వాదనలు వినిపించారు. డ్రైవర్ హత్య కేసులో అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నారని తెలిపారు. గతంలో సుప్రీం ఇచ్చిన బెయిల్‌ను అనంతబాబు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. హత్య కేసులో గతంలో ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరారు.