175 Seatsలో బీఆర్ఎస్ పోటీ.. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అంటోన్న తోట
అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన 175 చోట్ల అభ్యర్థులు బరిలో ఉంటారని ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్ స్పష్టంచేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో వైసీపీ, టీడీపీ విఫలం అయ్యాయని ఆరోపించారు.
Thota chandrasekhar:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై హాట్ హాట్ చర్చ జరుగుతోంది. ఏడాది సమయం ఉన్నా.. ప్రచారం, హామీలు గుప్పిస్తూ ప్రజల ముందుకు వెళుతున్నారు. ప్రధాన పార్టీలు వైసీపీ (YCP) , టీడీపీ (TDP) మధ్య హోరా హోరీ ఉండగా.. తామేమి తక్కువ తినలేమని జనసేన (Janasena), బీజేపీ (bjp) అంటున్నాయి. ఇటీవల ఏపీ బీఆర్ఎస్ శాఖ (brs) ఏర్పాటు చేయగా.. తాము కూడా రేసులో ఉన్నామని ఆ పార్టీ అంటోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అన్నీ సీట్లలో.. 175 చోట్ల (175 places) తమ అభ్యర్థులు బరిలో ఉంటారని తోట చంద్రశేఖర్ (thota chandrasekhar) స్పష్టంచేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో వైసీపీ (ycp), టీడీపీ (tdp) విఫలం అయ్యాయని ఆరోపించారు. గత టెర్మ్‌లో టీడీపీ (tdp).. ఇప్పుడు వైసీపీ (ycp).. ఆ రెండు ఫెయిల్ (fail) అయ్యాయని గుర్తుచేశారు. ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ (vizag steel plant) ప్రైవేటీకరణను బీఆర్ఎస్ పార్టీ (brs) వ్యతిరేకిస్తోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో రావెల కిశోర్ బాబు (ravela kishore babu) .. ఇతర ముఖ్య నేతలు చేరిన సంగతి తెలిసిందే. రావెల సేవలను జాతీయ స్థాయిలో ఉపయోగించుకుంటామని సీఎం కేసీఆర్ (cm kcr) ఇప్పటికే తెలిపారు. మొత్తం సీట్లలో పోటీ చేయడం అంటే కష్టమే.. కానీ ఏడాది సమయం ఉన్నందున అభ్యర్థులను రంగంలోకి దింపుతామని చంద్రశేఖర్ (chandrasekhar) అంటున్నారు.